అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి

Rammoorthy Kamareddy
1 Min Read

అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి

— అభ్యర్థి బాలయ్య

రామారెడ్డి డిసెంబర్ 03 (ప్రజాజ్యోతి)

ఇసన్నపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాలయ్య  సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది.బాలయ్య మాట్లాడుతూ ఆశతో ఉన్నవారికి అధికారం ఇస్తే దోచుకుంటారు. ఆలోచనతో ఉన్న వారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు. గ్రామాభివృద్ధి ఉద్దేశంతో ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుండి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవ కొరకు కృషి చేస్తానని, అన్ని రంగాల వర్గాల వారికి అనుకూలంగా సేవలందిస్తానని కుల మత జాతి విభేదాలు లేకుండా అందరిని సమాన దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఆత్మగౌరవంతో సమాజ సేవకు ముందుకు వచ్చను మీరందరూ పెద్ద మనసు చేసుకొని సర్పంచ్ గా గెలిపిస్తే అనేక అభివృద్ధి పనులు చేయిస్తాను, రాజకీయంగా, ఆర్థికంగా,సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిస్వార్థ రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్ధమైన సేవలను అందించడంలో ముందు ఉంటానని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని గ్రామస్తులను కోరారు. అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *