చివ్వెంల సెప్టెంబర్ 07(ప్రజాజ్యోతి):వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల వేళ డీజేల వినియోగంపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు.గణేష్ ఉత్సవాలు,శోభాయాత్రలు,నిమజ్జన కార్యక్రమాల్లో డీజే సిస్టమ్‌లను వినియోగించరాదని చివ్వెంల ఎస్సై స్పష్టం చేశారు.ఈ మేరకు పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీజే సిస్టమ్ యజమానులతో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి,నిబంధనలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉత్సవ కమిటీలు,శోభాయాత్రలు,నిమజ్జన కార్యక్రమాలకు డీజే సిస్టమ్‌లను అద్దెకు ఇవ్వడం,సరఫరా చేయడం లేదా వినియోగించడం చేయరాదని ఆదేశించారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీజేలను ఏర్పాటు చేసినా,సరఫరా చేసినా సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిబంధనలను పాటించేలా పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీజే యజమానులందరినీ బౌండ్‌ఓవర్ చేసినట్లు ఎస్సై తెలిపారు.గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు,భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.
