మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

Rammoorthy Kamareddy
1 Min Read

మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి టిడబ్ల్యూజేఎఫ్

రామారెడ్డి జూన్ 30 (ప్రజా జ్యోతి)

దాడి చేసిన రాజకీయ ముసుగులో గూండాలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి టిడబ్ల్యూజెఎఫ్ కామారెడ్డి డిమాండ్ చేస్తుంది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శనివారo మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసిన రాజకీయ ముసుగులో ఉన్న గూండాల నాయకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనీ కోరుతూ సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు మునిసిపల్ కార్యాలయం ముందుగల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు ప్రవీణ్ గౌడ్, కృష్ణచారి లు మాట్లాడుతూ..! దేశంలో చాలా రాష్ట్రాలలో ఏదో ఒకచోట ప్రతి రోజు జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టుల రక్షణకై ప్రత్యేక చట్టాలను రూపొందించి అమలు చేయాలన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారు రాజకీయ నాయకులైనా ?. మరి ఇంకెవరైనా ?. ఉపేక్షించక వారిని గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్ర ప్రభుత్వo పార్లమెంటులో చర్చించి ప్రత్యేక చట్టాలను రూపొందించాలని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో గాని దేశంలో గాని పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కృషి చేయాలని, లేనిచో టిడబ్ల్యూజెఎఫ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, కార్యదర్శి కరుణాకర్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణమూర్తి, మోహన్, ఉపాధ్యక్షులు జమాల్పూర్ లక్ష్మణ్, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ దశరథ్, బంగారి, శివకుమార్, శ్రీకాంత్, భాస్కర్, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *