బీసీ ఆలోచన సాధన సమితి ఎంఏఎస్ఎస్..!

Rammoorthy Kamareddy
2 Min Read
  1. బీసీ ఆలోచన సాధన సమితి ఎంఏఎస్ఎస్..!

— పిప్పరి లింబాద్రి, పొట్టి గారి విజయ్

రామారెడ్డి జూన్ 15 (ప్రజాజ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం మన ఆలోచన సాధన సమితి ఎంఎఎస్ఎస్ బీసీల చైతన్యమే మన ఆలోచన అనే ఉద్దేశంతో బస్టాండ్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. తదుపరి బీసీల చైతన్యమే ఇంటింట ప్రతి ఊరిలో ప్రతిబిసి గుండెలో బిసి భావజాల వ్యాప్తి లక్ష్యంగా ఎంఏఎస్ఎస్ బీసీల ఐక్యత కొరకు ఆహ్వానించడం జరిగిందని, బీసీల పిల్లల భవిష్యత్ కోసం అదేవిధంగా బీసీ సంస్థల కు మన వంతు వాటాగా దక్కించుకునే సదుర్దేశంతో బీసీలంతా ఏకం కావాలని జెండా ఆవిష్కరించారు.

పిప్పరి లింబాద్రి మాట్లాడుతూ…!

భారతీయ సమాజంలో కులం ఒక సత్యం లాగా భారతదేశం ఆచారాలు సాంప్రదాయాలు ఉత్పత్తి వృత్తి సేవలు మొదలైన వాటితో కులం గుర్తింపు పొందింది. వందల సంవత్సరాల సామాజిక చరిత్రలో అనేక మార్పుల తర్వాత కూడా కులం పునాదులు నేటికీ చెక్కుచెదరలేదు ఈ క్రమంలో ఆధిపత్య కులాలు సేవా కులాలను అలగదుకుతూ,ముందుకు సాగుతున్నాయి. ఫలితంగా వృత్తి కులాల వారు అన్ని రంగాలలో వెనుకబడుతున్నారు. అని దుయ్యబట్టారు.

పోట్టగారి విజయ్ మాట్లాడుతూ..!

జాతీయ ఉద్యమ కాలం నుంచి వెనుకబడిన కులాల హక్కుల కోసం అనేక ఉద్యమాలు నడిచాయి అందులో అతి ముఖ్యమైనది మహాత్మా జ్యోతిబాపూలే, సత్యశోధకు ఉద్యమం తమిళనాడు కేరళ రాష్ట్రాలలో వచ్చిన అనేక బీసీ ఉద్యమాలు బీసీల సాధికారత కోసం వచ్చినవే అని, భారత రాజ్యాంగం పౌరుల కు ప్రసాదించిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం వ్యక్తి గౌరవం మరియు అవకాశాలలోనూ సమానత్వంలోనూ అందించేందుకు 75 వసంతాల తర్వాత కూడా నేటికీ మన ప్రభుత్వాలు పురిటి నొప్పులు పడుతున్నాయి. భారత రాజ్యాంగం లోని 340 ఆర్టికల్ ద్వారా 1953 జనవరిలో భారత రాష్ట్రపతి మొదట వెనుకబడిన తరగతుల కమిషన్ నియమించారు.1961 జనాభా లెక్కలు సేకరించినప్పుడు కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు ఆధారంగా విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది. తెలంగాణలో కొండ లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న, బొజ్జం నరసింహులు,తదితరుల కృషి 1996 లో కాసు బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వం బీసీలకు 20 శాతం ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించింది. ఆత్మ న్యూనతా భావంతో వదిలి సామరస్య వాతావరణం లో శాంతియుతంగా మన హక్కులు సాధించేందుకు చైతన్య వంతమైన సమిష్టిగా రాజ్యాధికార దిశవైపు అడుగులు వేసే ప్రయత్నంలో భాగంగా మన ఆలోచన సాధన సమితి బీసీలంతా ఏకం కావాలని నిర్ణయించుకుంది. అని అన్నారు. తదుపరి జెండా ఆవిష్కరణ తర్వాత పలువురు ఐక్యత గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిప్పరి లింబాద్రి, శ్రీనివాస్, బాలు, సత్యనారాయణ, అనిల్, విజయ్, లక్ష్మినారాయణ, ఎన్. శ్రీను, పాండు తదితరులు బిసి ఐక్యత కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *