కాలభైరవ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు
రామారెడ్డి మే 27 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలం ఇసనపల్లి, రామారెడ్డి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని భారీ నీటి పారుదల శాఖ మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ సమక్షంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా ఆలయం విశిష్టత గురించి ఈవో ప్రభు గుప్తా వివరించారు. దైవదర్శనానికి రావడం మొదటిసారి అని అన్నారు. అధికారికంగా కాకుండా రావడం జరిగిందని..? కార్యకర్తలకు ఇలాంటి సమాచారం లేకుండానే దైవదర్శనం ఘనంగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బుర్ల ప్రభు గుప్తా, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ , ఆఫీస్ సబార్డినేటర్ నాగరాజు, భరత్,బిఆర్ఎస్ నాయకులు ఉమ్మడి మండల మాజీ జడ్పిటిసి పడిగల రాజేశ్వరరావు, రామారెడ్డి మండల మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, సత్యం రావు, తదితరు నాయకులు పాల్గొన్నారు.