ఎల్లారెడ్డి జూన్- 21(ప్రజా జ్యోతి)
ఈనెల 24న ఎల్లారెడ్డికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రానునట్లు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా శనివారం విలేకరులతో తెలిపారు. ఎల్లారెడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్ ను మంత్రి, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు అన్నారు. ప్రారంభనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అన్ని హంగులతో పూర్తి చేసుకున్న నూతన బస్టాండ్ ని ప్రారంభింనుండడం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనడానికి ఇలాంటి అభివృద్ధి పనులే నిదర్శనం అని తెలిపారు. నూతన బస్టాండ్ ప్రారంభ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలిరావాలని కోరారు.
ఈనెల 24న ఎల్లారెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్
Leave a Comment
