పరకాల/ప్రజాజ్యోతి::
ప్రజలకు చేరువగా రెడ్ క్రాస్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ భవనానికి భూమి పూజ చేశారు. జిల్లా ప్రజలకు రెడ్ క్రాస్ సేవలు మరింత చేరువ చేసేందుకు పరకాల పట్టణంలో భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఈ భూమి పూజ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్థానిక శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, నాయకులు సోదా రామకృష్ణ, బిల్లా రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.