.
పెదకాపర్తిలో మద్యం దుకాణాల బందు కోసం మహిళల ర్యాలీ
గ్రామంలో యదేచ్చగా బెల్ట్ షాపుల నిర్వహణ
వారం రోజుల్లో మధ్యం షాపులు మూసివేయాలి
గ్రామపంచాయతీ కార్యాలయం ముందు మహిళల నిరసన
చిట్యాల ఏప్రిల్ 28(ప్రజా జ్యోతి); నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల మండలం, పెద్దకాపర్తి గ్రామంలో బెల్ట్ షాపులపై మూసివేయాలని మహిళా సంఘాలు నడుం బిగించాయి సోమవారం నాడు మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో బెల్ట్ షాపుల వద్దకు వెళ్లి మద్యం అమ్మే దుకాణాలు బందు చేయాలని జరిగింది. గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామపంచాయతీ వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. తదనంతరం మాట్లాడుతూ గ్రామంలో 17 నుంచి 20 బెల్ట్ షాపులు ఏదేచ్ఛగా నిర్వహిస్తున్నారు దీని వలన ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని యువత గంజాయికి కు మద్యానికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాపోయారు గ్రామంలోని బెల్ట్ షాపులు మూసివేయాలని కోరారు. బెల్ట్ షాప్ యాజమాన్యానికి వారం రోజుల్లోగా గ్రామంలోని బెల్ట్ షాపులు మూసివేయాలని లేనియెడల తమ కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్తామని తెలిపారు ఇప్పటికైనా గ్రామంలోని యువత నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బెల్ట్ షాపులను మూసి వేయడానికి సహకరించాలని కోరారు. అలాగే గ్రామంలో గంజాయికి అలవాటు పడ్డ యువత ప్రక్కదోవ పట్టకుండా పోలీసులు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మమత,లక్ష్మి, లక్ష్మమ్మ సుగుణమ్మ అనురాధ ఎట్టమ్మ అలివేలు మల్లీశ్వరి స్వాతి యాదమ్మ మల్లమ్మ సైదమ్మ శ్రావ్య సుభద్ర లావణ్య మౌనిక చంద్రమ్మ పార్వతమ్మ మంజుల ఇంద్రమ్మ పాపమ్మ జయమ్మ బుచ్చమ్మ పార్వతమ్మ మౌనిక మంజుల తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో 17 పైగా బెల్టు షాపులలో మద్యం అమ్ముతున్నారు. గ్రామంలోని యువతతో పాటు పెద్దవారు సైతం మద్యం, గంజాయి, తదితర మాదకద్రవ్యాల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు….. ఆర్థికంగా నష్టపోతున్నారు…….. ఇప్పటికైనా గ్రామంలోని బెల్టు షాపులను అరికట్టాలని గ్రామ మహిళలంతా కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అధికారులు ఈ విషయాన్ని పరిష్కరించి మద్యం షాపులను, అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ లేనియెడల మహిళల ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.
లక్ష్మీ
గ్రామస్తురాలు