అన్నిదానాల్లో అన్నదానం గొప్పది

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 18(ప్రజా జ్యోతి): అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని మున్సిపల్ కౌన్సిలర్లు బత్తుల ఝాన్సీ రమేష్, గాలి సాయికిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 43వ వార్డ్ నెహ్రూ నగర్ లో కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ రమేష్ సౌజన్యంతో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల 38వ వార్షికోత్సవం సందర్భంగా నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద బత్తుల వెంకటరాజు రమణమ్మ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. గత 38 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.ఆ గణనాథుని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఉత్సవ కమిటీ వారికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దాతలు డాక్టర్ శ్రీరామ్ కుమార్ స్రవంతి, సుంకరి సందీప్ శ్రావణి,యాపాల వెంకటరెడ్డి అరవింద, మహమ్మద్ రఫీ, మట్టపల్లి లింగయ్య సత్యవతి, గుంజ రామకృష్ణ కోటేశ్వరి, శ్రీరామ్ భవాని,బత్తుల నాగరాజు, మెకానిక్ మస్తాన్, కుంచం దుర్గారావు,కరాటే సయ్యద్, మీనయ్య, వేముల మోహన్, నక్కల రవి, పామిశెట్టి బాలయ్య, నిఖిల్,వెంకన్న, రఘు, శ్రీనివాస్, లింగయ్య, ప్రమీల,లావణ్య, విజయ, రమణి, రమణ, నిర్మల, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *