చేర్యాల, మే 23(ప్రజాజ్యోతి):
చేర్యాల మున్సిపల్ కేంద్రంలో గుర్తు తెలియని దొంగలు శుక్రవారం రాత్రి పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి వెంబడి వరుస చోరీలకు పాల్పడ్డారు.స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణ కేంద్రానికి చెందిన యాంసాని కృష్ణమూర్తి నివాసం ఉంటున్న ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి దొంగలు చొరబడ్డారు. ఆ తర్వాత అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న శ్రీ మార్ట్ తో పాటు, దాని పక్కనే ఉన్న ‘డెక్కన్ చాయ్’ హోటల్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.వరుసగా జరిగిన ఈ మూడు చోరీల్లో ఎంతమేర నగదు, బంగారం లేదా ఇతర సామాగ్రి అపహరణకు గురైందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న చేర్యాల సీఐ రమేష్ నాయక్, ఎస్సై అపూర్వ రెడ్డి తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తూ, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
చేర్యాలలో దొంగల బీభత్సం – వరుసగా మూడు చోట్ల చోరీలు
- వరుస చోరీలతో భయాందోళనలో పట్టణ ప్రజలు
Leave a Comment
