వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Siddipet Bureau
1 Min Read

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

చేర్యాల ఏప్రిల్ 15(ప్రజాజ్యోతి):రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఐకెపి,సహకార సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాయి. బుధవారం చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం చేర్యాల వ్యవసాయ మార్కెట్ లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, తూకంలో పారదర్శకత పాటించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర నేరుగా రైతులకు అందుతుంది అని తెలిపారు.గ్రామాల్లోనే కేంద్రాలు ఉండటం వల్ల రవాణా భారం తగ్గుతుందని,రైతన్నలు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయడమే మా లక్ష్యమని,గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఇలాంటి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత,మార్కెట్ కార్యదర్శి రవికుమార్,స్థానిక రైతులు, రైతు నాయకులు, మండల అధికారులు,సహకార సంఘాల ప్రతినిధులు,చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *