నర్సాపూర్ (ప్రజాజ్యోతి) స్థానిక ఆర్టీసీ డిపోలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెదక్ డిపో మేనేజర్ సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాల కోసం 9491634420 నంబరులో సంప్రదించాలని కోరారు.
