గురుకుల పాఠశాలకు 9 మంది విద్యార్థుల ఎంపిక
రామారెడ్డి మార్చ్ 25 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని గోకుల్ తండా పాఠశాల 4 వ తరగతి చదువుతున్న 9 మంది విద్యార్థులు ఇటీవలే జరిగిన గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష రాసి సీటును సాధించడం జరిగింది. ఈ సందర్భంగా గురుకుల ప్రవేశ పరీక్షలో సీటు సాధించిన విధ్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖాదిర్ అహ్మద్, టీచర్ భూపతి శ్రీనివాస్, పిల్లలకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ విజయాన్ని ప్రేరణగా తీసుకొని బాగా చదువుకొని విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను అభినందించి స్వీట్లు పంచడం జరిగింది.
