ముమ్మిడివరం గ్రామంలో సొంత కుటుంబ సభ్యులపై తమ్ముడి కక్షసాధింపు.. పచ్చని పంట నాశనం..!
సంగెం, మార్చి24 (ప్రజాజ్యోతి):
వ్యక్తిగత కక్షలతో తన సొంత అన్నల ఎదుగుదలను ఓర్వలేక, కష్టపడి సాగు చేసిన పంట పై గడ్డిమందు పిచికారీ చేసి నాశనం చేసిన అమానుష ఘటన మండలంలోని ముమ్మిడివరం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయం పై బాధితులు మంగళవారం రోజున విలేకరుల సమావేశంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా లక్క శ్రీనివాస్ లక్క నగేష్ మాట్లాడుతూ..మా తమ్ముడు అయిన లక్క సుధాకర్ మేము వేసుకున్నటువంటి పంట చేను పై గడ్డి మందు కొట్టి పంట నాశనం చేసినాడని,లక్క సుధాకర్ స్థానిక ఎమ్మార్వో ఆఫీసులో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడని,అతనిపైన చర్యలు తీసుకోవాలని అన్నారు మేము నలుగురం అన్నదమ్ములమని పెద్దాయన పేరు లక్క రమేష్, రెండో వ్యక్తి లక్క శ్రీనివాస్,మూడో వ్యక్తి లక్క నగేష్,నాలుగో వ్యక్తి లక్క సుధాకర్.మా నాన్న పేరు లక్క సాయిలు మా నాన్న చనిపోకముందు మస్కూరిగా పనిచేసేవాడు.నాన్న చనిపోయిన తర్వాత ఈ ఎలతనం ఎవరికి రావాలి ఎవరు చేయాలి, అని మేము నలుగురు అన్నదమ్ములం పోటీపడినాము.దీనికి నలుగురం ఒక ఒప్పందానికి వచ్చి,మన కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దమనుషులను తీసుకొని వచ్చి సమస్య పరిష్కారం చేసుకుంటామని ఒప్పుకొని ముగ్గురు పెద్ద మనుషులు బోనాల మల్లయ్య, మడత స్వామి,మడత కేశవులు వారి సమక్షంలో సమస్య పరిష్కరించుకున్నాము.నలుగురి అన్నదమ్ముల పేరు మీద చీటీలు వేసుకొని ఎవరి పేరు వస్తే వారు పాలి వాళ్ళ ఖర్చులు చూసుకొని మా ముగ్గురి అన్నదమ్ములకు తల ఎనిమిది గంటల భూమి ఇవ్వాలని పెద్దమనుషులు తీర్మానం చేసుకొని వస్తే అందుకు మీ అందరం ఒప్పుకొని చీటీలు తీసుకోగా మా తమ్ముడు అగు లక్క సుధాకర్ కు చీటీ వచ్చింది.ఒప్పందం ప్రకారం మా తమ్మునికి ఉద్యోగం రావడానికి మేమందరం అఫీడబిట్ పై సంతకం చేసి అతనికి ఉద్యోగం వచ్చేలా ఒప్పుకున్నాము తర్వాత మాకు ఒప్పందం ప్రకారం తల ఎనిమిది గంటల భూమిని 2015వ సంవత్సరంలో మాకు అతని పేరు మీద ఉన్న భూమిని అప్పగించగా అప్పటినుండి మేము దాన్ని సాగు చేసుకుంటూ వచ్చాము. 2024 సంవత్సరంలో మేము భూమిని చదును చేసుకుంటున్నాము దాన్ని మా పేరు మీదికి మార్చమని మా తమ్ముడు ఆగు లక్క సుధాకర్ ను అడుగగా మీకు భూమి ఇవ్వను డబ్బులే ఇస్తాను మీ దిక్కున చోట చెప్పుకోండి నాకు ఎమ్మార్వో తెలుసు ఆర్డిఓ తెలుసు కలెక్టర్ తెలుసు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు నా ఉద్యోగాన్ని ఎవరు తీపించలేరు అని అప్పటి నుండి పోలీస్ స్టేషన్ ఎమ్మార్వో ఆఫీస్ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగేలా మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ మాపై కేసులు పెడుతూ ఆనందంగా ఉద్యోగాన్ని అనుభవిస్తున్నాడు.సమస్య పరిష్కారం కొరకు 2025 నవంబర్ నెలలో తాసిల్దార్ కు ఫిర్యాదు ఇవ్వగా అతను పెద్దమనుషుల సమక్షంలో సమస్య పరిష్కరించుకొమ్మని లేనిపక్షంలో సుధాకర్ పై చర్యలు తీసుకుంటానని మాకు హామీ ఇవ్వగా మేము పెద్ద మనుషులను సంప్రదించగా పంచాయితీ 2026 ఫిబ్రవరి నెలలో కూర్చొని మాట్లాడుకోగా అక్కడికి వచ్చిన పెద్దమనుషులు సాక్షులను విచారించగా సుధాకర్ గతంలో వారి అన్నదమ్ములకు తల ఎనిమిగుంటలు భూమి ఇచ్చినట్లుగా అప్పుడు భూమి ఇస్తానని ఒప్పుకున్నది వాస్తవమే కానీ ఇప్పుడు నేను భూమి ఇవ్వను భూమికి బదులు డబ్బులు ఇస్తానని వెళ్లిపోయాడు.మేము రైతులమని హేళనగా హేళన చేస్తూ ఉద్యోగాన్ని ఆస్వాదిస్తూ మమ్ముల ఖర్చుల పాలు చేస్తూ మేము వేసుకున్న పంటను నాశనం చేసి దర్జాగా తిరుగుతున్నాడని వాపోయారు.ఉద్యోగం ఉందని అహంతో రైతులమైన మమ్మల్ని భూమి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.ఇది రైతులందరూ,అధికారులు గుర్తించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న,మా పంట నాశనం చేసిన లక్క సుధాకర్ పై కఠినమైన,చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు ఇచ్చినటువంటి పొలాన్ని మాకు ఇప్పించి పంట నష్టం పరిహారాన్ని ఇప్పియాలని మాకు న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా మీడియా పరంగా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు.
