బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
—మున్నూరు కాపు యువజన (సిండికేట్) సంఘం
రామారెడ్డి ఫిబ్రవరి 06 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి గ్రామానికి చెందిన మున్నూరు కాపు యువకుడు గత రెండు రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తులు చేస్తుండగా అకాల మరణం సంభవించడం జరిగింది. మృతుడు కాటం రవి కుటుంబానికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నందున ఆర్థిక సహాయ నిమిత్తం,రామారెడ్డి మున్నూరు కాపు సిడికేట్ యువజన సంఘం స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం 30000/- వేల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ హనుమాయల నవీన్, సౌడం నవీన్, బండి భాస్కర్, ఏఈఓ రాకేష్,రంజిత్, మున్నూరు కాపు యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
