-
అగ్రంపాడు జాతరలో అపశృతి, భక్తురాలి తలకు గాయం
-
తక్షణమే వైద్య శిబిరానికి తరలించిన తహసీల్దార్
ఆత్మకూరు, జనవరి 31 (ప్రజాజ్యోతి):
అగ్రంపాడు జాతరలో అపశృతి చోటుచేసుకుంది. జాతరకు వచ్చిన ఓ భక్తురాలు ప్రమాదవశాత్తు తలకు కొబ్బరి కాయ తగలడంతో తీవ్ర గాయమయ్యింది. ఈ ఘటనలో ఆమెకు తల పగిలి భారీగా రక్తస్రావం జరిగింది. హనుమకొండ జిల్లా గోపాలపూర్ కు చెందిన శ్రావణి కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చింది. భక్తుల తాకిడి అధికముగా ఉండటంతో దూరం నుండి వేరే భక్తులు కొబ్బరి కాయ విసిరారు. అది నేరుగా భక్తురాలు శ్రావణి తలకు తగలటంతో ప్రమాదం జరిగింది. వెంటనే అక్కడున్న రెవెన్యూ అధికారి తహసీల్దార్ జగన్ మోహన్ రెడ్డి ఆమెను చికిత్స కోసం సమీప ప్రభుత్వ వైద్య శిబిరానికి తరలించారు. మెడికల్ అధికారులు డాక్టర్ జాస్మిన్, సౌమ్య చికిత్స అందించారు. ప్రస్తుతం శ్రావణి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు.

