సొంత గడ్డపై పట్టు నిలుపుకున్న హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

Warangal Bureau
1 Min Read

సొంత గడ్డపై పట్టు నిలుపుకున్న హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

సొంత గడ్డపై ‘ఇనగాల’ పట్టు : డీసీసీ అధ్యక్షుడిగా తొలి విజయం ఆత్మకూరులోనే..!!

(ఆత్మకూరు) : *హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, రాజకీయ క్షేత్రంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా ఆయన డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే తన సొంత గ్రామమైన ఆత్మకూరులో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి సత్తా చాటారు.

ఆత్మకూరు గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఇనగాల, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పర్వతగిరి మహేశ్వరి ని సర్పంచిగా భారీ మెజారిటీతో గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. జిల్లా స్థాయి బాధ్యతల్లో ఉంటూనే, క్షేత్రస్థాయిలో గ్రామ రాజకీయాలను చక్కదిద్ది తన కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపారు. సొంత గ్రామంలో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా పక్కా వ్యూహంతో పర్వతగిరి మహేశ్వరిని గెలిపించి రాజకీయ పట్టును నిరూపించుకున్నారు. ఈ విజయం ఇనగాల వెంకట్రామ్ రెడ్డికి డీసీసీ అధ్యక్షుడిగా నైతిక బలాన్ని ఇవ్వడమే కాకుండా, జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నమ్మకాన్ని కలిగించింది.

తన స్వంత మండలమే కాకుండా హుస్నాబాద్, హుజూరాబాద్, స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాలలోని 12 మండలాలలో కుడా జిల్లా స్థాయి బాధ్యతల్లో ఉంటూనే, క్షేత్రస్థాయిలో గ్రామలలో పర్యటించి కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపారు.

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *