సిగరెట్టు ‘దూరం వెళ్లి తాగమన్నందుకు దాడి’
- హోటల్ యజమానిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
ఆత్మకూరు, డిసెంబర్ 11 (ప్రజాజ్యోతి):
సిగరెట్టు పొగ వస్తుంది ‘దూరం వెళ్లి తాగమన్నందుకు హోటల్ నడుపుతున్న దంపతులపై ఇద్దరు గుర్తు తెలియని యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నీరుకుళ్ల గ్రామానికి చెందిన అర్షం రాజ్ కుమార్ దంపతులు గత కొంత కాలం నుండి నీరుకుళ్ల క్రాస్ వద్ద జాతీయ రహదారి 163 పై హోటల్ నడుపుకుంటున్నారు. గురువారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారి హోటల్ కు వచ్చి సిగిరెట్లు తీసుకొని తాగుతుండగా ఇక్కడ తాగవద్దని రాజ్ కుమార్ వారి భార్య చెప్పింది. కోపానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు అమ్ముతున్నారని..? కర్రలతో తల పై కొట్టడంతో తల పగిలింది. మొఖం పై కొట్టరని, ముక్కు పై బలంగా కొట్టారని బాధితుడు వెల్లడించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు స్టేషన్ అధికారులు తెలిపారు. పట్ట పగలే జాతీయ రహదారి పై దాడి జరుగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
