ప్రజా సంక్షేమానికి తల వంచి పని చేస్తా

— అభ్యర్థి బండి ప్రవీణ్
కామారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 02 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి ప్రవీణ్ ను సర్పంచ్ గా గెలిపిస్తే అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉండి.ప్రజల కష్టాలే నా కష్టాలు ప్రజలే నా కుటుంబం సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని నమ్మే వ్యక్తిని సామాన్య ప్రజల సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేసి వారికీ న్యాయం చేయడం నా అదృష్టంగా భావించే వ్యక్తిని కాబట్టి దయచేసి గ్రామ పెద్దలు ప్రజలు ముఖ్యంగా యువత, గ్రామానికి సేవ చేయడానికి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. యువతకు గ్రౌండ్ డెవలప్మెంట్ మినీ స్టేడియం, యువతకు స్టడీ మెటీరియల్, డిజిటల్ లైబ్రరీ, పచ్చని ప్రకృతితో వినోదం ఆహ్లాదం కలిగించే విధంగా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం. అన్ని రకాల అర్హతలు కలిగిన పెన్షన్ బాధితులకు తక్షణమే సమస్యను పరిష్కరిస్తాను, త్రాగునీరు, డ్రైనేజీ, సిసి రోడ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు అన్ని విధాలుగా సమన్యాయం జరిగేలా కృషి చేస్తాను, ముఖ్యంగా పటేల్ చెరువు వద్ద చివరి అంతిమయాత్రల స్థలం వైకుంఠధామం ను ఏర్పాటు చేస్తాను, గల్లీ గల్లీకి ఎల్ఈడి లైట్స్, ప్రధాన చౌరస్తాలలో ఎల్ఈడి ఐమాక్స్ లైట్స్, సీతారామచంద్రస్వామి ఆలయానికి అభివృద్ధికి కృషి చేస్తా, ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నిశ్చలంగా ప్రజా సంక్షేమం కోసం 24×365 రోజులు అందుబాటులో ఉండే విధంగా గ్రామంలో ఫోన్ నెంబర్ ను కేటాయిస్తాను, వార్డు వార్డుకు ప్రజా సమస్యల బాక్సులు పెట్టిస్తాను, వాటిని ప్రజా క్షేత్రమైనటువంటి గ్రామసభలో తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాను, సర్పంచ్ అనేది ఒక్క పదవి ఒక్క బాధ్యత పనిచేయడానికి ఇచ్చే అవకాశం మాత్రమే ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకున్నాను. సదా మీ సేవలో కొలువై ఉంటాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపెడతాను
