పలు కుటుంబాలకు పరామర్శ 
— మాజీ జెడ్పిటిసి నారెడ్డి మోహన్ రెడ్డి
రామారెడ్డి సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని బాధిత కుటుంబాలను బుధవారం మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది.స్కూల్ తాండాకు చెందిన గంగవత్ పెంటయ్య తల్లి ఇటీవల కాలంలో పరమవదించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడిగల దత్తు గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతకుంట కిషన్, బి పేట నర్సింలు, బొంపల్లి రాజేందర్,రగోతం రెడ్డి, సల్మాన్, కుమ్మరి శంకర్,మద్దికుంట దయానంద్,గంగావత్ రవీందర్, కాసిం, తిరుపతి నాయక్, తదితరులు పరామర్శించడం జరిగింది.
