అడిషనల్ డీసీపీ ‘నల్లమల రవి’కి ఇండియన్ పోలీస్ మెడల్..

Warangal Bureau
1 Min Read

వరంగల్ / ప్రజాజ్యోతి::

 79వ పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పరిపాలన విభాగం అదనపు డీసీపీగా విధులు నిర్వహిస్తున్న ‘నల్లమల రవి’కి ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ జిల్లా ఏనుగొండ ప్రాంతానికి చెందిన అడిషనల్ డీసీపీ నల్లమల రవి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో యం.ఎస్సీ పూర్తి చేసి 1991 సంవత్సరంలో ఎస్. ఐ గా ఎంపికై శిక్షణ అనంతరం మెదక్ జిల్లాలోని శివం పేట,తుఫ్రాన్,మునిపల్లె పోలీస్ స్టేషన్లలో ఎస్. ఐ గా చేసి సిఐగా పదోన్నతి పొంది అమ్రాబాద్, మిర్యాలగూడ,సదాశివాపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ సిఐ పనిచేశారు. అలాగే డి.ఎస్పీగా సంగారెడ్డి, జహిరాబాద్, అడిషనల్ డీసీపీ కరీంనగర్ పోలీస్ ట్రయినింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ గా పని చేశారు. ముఖ్యంగా అదనపు డీసీపీ నక్సల్ ప్రాబల్యం ఉన్న పోలీస్ స్టేషన్లలో సమర్ధవంతంగా పనిచేయడంతో పాటు, సమస్యాత్మాక ప్రాంతాల్లో కూడా విజయవంతం విధులు నిర్వహించి అధికారుల మన్ననలు పొందడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల నుండి పలు అవార్డులను అందుకున్నారు.

ఈ సందర్బంగా పోలీస్ మెడల్ ఎంపికైన అడిషనల్ డీసీపీ రవికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తో పాటు డీసీపీ లు, అడిషనల్ డీసీపీ,ఏ. ఎస్పీలు,ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది అభినందనలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *