చిట్యాల మున్సిపాలిటీ లో మద్యం (బెల్ట్ ) గోలసు దుకాణలు బంద్ చెయ్యాలి……

Nalgonda Bureau
2 Min Read

చిట్యాల మున్సిపాలిటీ లో మద్యం (బెల్ట్ ) గోలసు దుకాణలు బంద్ చెయ్యాలి

తెలంగాణ మలి దశ ఉద్యమ నేత, బీజేపీ నేత సంజయ్ దాస్ గౌడ్

నల్గొండ జూన్ 24(ప్రజాజ్యోతి ప్రతినిధి): చిట్యాల పట్టణంలో విచ్చలవిడిగా వెలిసిన మద్యం బెల్టు షాపులను వెంటనే మూసివేయాలని అందుకు తగిన చర్యలను తీసుకోవాలని ఎక్సైజ్, పోలీస్ శాఖలను తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గల్లి గల్లి లో రాత్రి పగలు లేకుండా మద్యం గొలుసు దుకాణాలు నిరంతరం నడుస్తున్నాయని దీనివలన పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలు, ప్రార్ధన మందిరాలు, పాఠశాలల సమీపంలోనే మద్యం గొలుసు దుకాణాలు ఉండడం వల్ల మహిళలు విద్యార్థులు తాగుబోతుల వలన అసౌకర్యానికి గురవుతూ ఇబ్బందులు పడుతున్నారని దేవాలయకొచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిట్యాల పట్టణంలో అర్ధరాత్రులు బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మడం వలన రాత్రుల్లో కాలనీలలో కొత్త కొత్త వ్యక్తులు సంచారిస్తున్నారని ప్రజల భద్రత విషయంలో ఆందోళన కలుగుతుందని సంజయ్ దాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులలో నాసిరకం మద్యం అమ్మడం వలన వ్యవసాయ ఇతర కూలీలు యువత ఆ మద్యం సేవించడం వలన చిన్న వయసులోనే చనిపోతున్నారని వారి ఆరోగ్యం పూర్తిగా క్షినిస్తుందని ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నo అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిట్యాల లో మద్యం షాపులు రాత్రి పది గంటలకు మూసివేస్తే పట్టణంలోని మద్యం బెల్టు దుకాణాలు 24 గంటలు ఎవరి అనుమతి, అండదండలతో నిర్వహిస్తున్నరు అని సంజయ్ దాస్ గౌడ్ ప్రశ్నించారు. వైన్ షాపుల్లో దొరకని బ్రాండ్లు బీర్లు బెల్ట్ షాపుల్లో దొరుకుతున్నాయని, వైన్ షాపుల పక్కన సిట్టింగ్లు నిర్వహించాలి అంటే ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని నిబంధనలు ఉన్నాయని, పట్టణంలో ప్రజా నివాస ప్రాంతాల్లో కాలనీలలో, ఇండ్ల ల్లో మద్యం బెల్ట్ షాపుల్లో సిట్టింగ్లు నిర్వహిస్తూ, మధ్యo ప్రియులకు ఇష్టమైన వంటలు చేస్తూ వ్యాపారం చేయడానికి ఎవరు అనుమతి ఇస్తున్నారని, ప్రజల, యువత ఆరోగ్యాలతో ఆటలాడుతున్న మద్యం బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేరని ఆయన ప్రశ్నించారు. త్వరలో మద్యం గొలుసు (బెల్ట్) షాపులు మూసివేయాలని చిట్యాల
పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, మహిళా సంఘాలు యువజన, విద్యార్థి సంఘాలు కలుపుకొని ప్రత్యేక్ష ఉద్యమ కార్యాచరణ చెప్పాడుతామని మద్యం బెల్టు దుకాణాలను పూర్తిగా బంద్ చేసే విధంగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *