దామెర, ఏప్రిల్ 11 (ప్రజాజ్యోతి):
రోడ్డుపై రైతులు ఆరవసిన మక్కలు.. ఓ నిండు ప్రాణాన్ని బలి గొన్నాయి.. ఈ హృదయ విదారకర సంఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం తక్కళ్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా ఆరెపల్లి గ్రామానికి చెందిన సుంకరి వీరేందర్ (56) తక్కళ్లపాడు నుండి ఓగులాపూర్ వైపు ప్రయాణం చేస్తుండగా.. ఎదురుగా ట్రాక్టర్ రావటంతో తప్పించబోగా రోడ్డు పై ఆరబోసిన మక్కల పైకి టూ వీలర్ వెళ్లడంతో జరిగిన ప్రమాదంలో వీరేందర్ స్పాట్లోనే మృతి చెందాడు. రైతులు రోడ్డుపై మొక్కలు ఆరబోసి అడ్డుగా కర్రలను ఏర్పాటు చేశారు. ఆ కర్రకు బైక్ తగిలి రోడ్డు పై పడటంతో తల పగిలి స్పాట్ లోనే మృతి చెందాడు.