ఆయన పుట్టింది ఆదిలాబాద్ అడవుల్లోని మారుమూల ఓ చిన్న కుగ్రామంలో. చదివింది కేవలం పదో తరగతి మాత్రమే. కానీ తాను అనుకున్న రంగంలో రాణించారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు. ట్రైన్ టికెట్‌కు కూడా డబ్బులు లేని రోజుల్లో టికెట్ తీసుకోకుండా హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆయన రూ. 5 జీతంతో అంచలంచెలుగా ఎదిగారు. కష్టించేతత్వం, పట్టుదల, మంచి మనసుతో రూ. కోట్లకు పడగలెత్తారు. ఆయన మరెవరో కాదు నిలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు. హైదరాబాద్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది చార్మినార్, బిర్యానీ, చాయ్ బిస్కెట్. నగరానికి కొత్తగా వచ్చేవారు కచ్చితంగా ఈ మూడింటిని ఆస్వాదించాల్సిందే. అంతలా అవి ప్రాచుర్యం పొందాయి. ఇక ఇటీవల హైదరాబాద్ ఛాయ్ అంటే అందరూ చెప్పే పేరు నిలోఫర్ కేఫ్. ఎప్పట్నుంచో ఈ కేఫ్ ఫేమస్ అయినా.. ఇటీవల హైటెక్ సిటీ ప్రాంతంలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయటంతో దాని పేరు, బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా నిలోఫర్ కేఫ్ పేరు మార్మోగుతోంది. దానికి కారణం హైటెక్ సిటీ కేఫ్ నెలవారీ రెంట్ అక్షరాల నెలకు రూ. 40 లక్షలు నిలోఫర్ కేఫ్ రెంట్ విషయం అటుంచితే దాని ఓనర్ గురించి తెలుసుకునేందుకు కూడా చాలా మంది గుగూల్‌లో వెతుకున్నారు. అయితే ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’ అన్న సామెతకు నిజమైన అర్థం చెప్పిన వ్యక్తిగా నిలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు నిలిచిపోతారు. కష్టపడితే మనుషులు గొప్పస్థాయికి వెళ్తారని ఆయన నిరూపించారు. ట్రైన్‌లో టికెట్ కూడా లేకుండా ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ అడవుల్లోని మారుమూల లగ్గామ్ గ్రామం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన బాబూరావు అంచెలంచెలుగా ఎదిగి గొప్ప స్థాయికి చేరుకున్నారు. రూ. 5 జీతంతో జీవనాన్ని ప్రారంభించిన ఆయన నేడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబూరావు తన బాల్యం, పడిన కష్టాలు, చదువు, నిలోఫర్ కేఫ్ సెక్సెస్‌కు గల కారణాలు వెల్లడించారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టిన బాబూరావు.. చిన్నతనంలో చదువుకునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఉచితంగా చదువుతు చెబుతున్నారని తెలిసి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడే హాస్టల్‌లో ఉంటూ 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలోనే ఖర్చుల కోసం చిన్న చిన్న పనులు చేసేవారు. టెన్త్ తర్వాత పైచదువులు చదివించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవటంతో హైదరాబాద్ నగరంలో పనికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.కోట్లకు పడగలెత్తారు.