రూ.15 వేలకే పసందైన ఫోన్లు

V. Sai Krishna Reddy
2 Min Read

Galaxy M 35సామ్‌సంగ్ కంపెనీకు చెందిన గెలాక్సీ ఎం35 5జీ స్మార్ట్‌ఫోన్ వివిధ డిస్కౌంట్లతో 6 జీబీ + 128 జీబీ వేరియంట్ కేవలం రూ.13,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్‌తో అందుబాటులో ఉంది. లావా బ్లేజ్ డుయో 5 జీ 6జీబీ +128 జీబీ మోడల్ ఫోన్‌ను కేవలం రూ.16,998కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్‌ను రూ.15,000 కంటే తక్కువ ధరకు పొందవచ్చు. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఒక చిన్న స్క్రీన్ ఉంది. ఈ ఫోన్‌ రెండు ఎమోఎల్ఈడీ స్క్రీన్‌లను కలిగి ఉన్న మొదటి ఫోన్. ఈ ఫోన్ ఎమోఎల్ఈడీ స్క్రీన్ 120 హెచ్‌జెడ్ వద్ద రిఫ్రెష్ అవుతుంది. ఈ ఫోన్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఆకట్టుకుంటుంది. పోకో ఎం7 ప్రో 5జీ 6 జీబీ+128 జీబీ ఫోన్‌ను కేవలం రూ. 13,990కు సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి మరింత తక్కువ ధరకు ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 5110 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా ఆకట్టుకుంటుంది. రియల్ మీ నార్జో 70 టర్భో 5 జీ 6 జీబీ + 128 జీబీ మోడల్ డిస్కౌంట్ల తర్వాత రూ. 13,999కు అందుబాటులో ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ద్వారా పని చేసే ఈ ఫోన్ సూపర్ స్లిమ్ అంటే కేవలం 7.6 మిమీతో ఆకట్టుకుంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాతో ఫొటోగ్రఫీ ప్రియులను ఆకర్షిస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం16 5జీ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ఫోన్ అమెజాన్‌లో రూ.13,999కు కొనుగోలు చేయవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్‌లతో పాటు కూపన్ డిస్కౌంట్‌లను ఉపయోగించి మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఎమోఎల్ఈడీ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆకట్టుకుంటాయి. అలాగే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ ప్రైమరీ బ్యాక్ కెమెరా ఆకర్షిస్తుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *