తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిశారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సన్మానించారు. ముఖ్యమంత్రితో భేటీకి సంబంధించిన ఫొటోలను మంచు విష్ణు తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా పంచుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం తమకు లభించిందని మంచు విష్ణు పేర్కొన్నారు. పలు ముఖ్యమైన అంశాలపై ఆయనతో చర్చించడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చూపిన చొరవకు, నిబద్దతకు ధన్యవాదాలు అని తెలిపారు