SLBC టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది కార్మికుల కోసం 15వ రోజు కూడా రెస్క్యూ కార్యక్రమం కొనసాగుతోంది. టన్నెల్ చివరి భాగంలో రెండు కీలక ప్రాంతాలును గుర్తించారు. డాగ్ స్క్వాడ్ కూడా ఆ ప్రాంతాలను ధ్రువీకరించింది. నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుర్వాసన వస్తుండటంతో అక్కడే కార్మికుల ఆచూకీ ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి 15వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ విషయంలో టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలోని రెండు స్పాట్స్ కీలకంగా మారాయి. ఇదివరకే రెండు స్పాట్స్ గుర్తించి, తవ్వకాలు చేస్తోన్న రెస్క్యూ బృందాలు. కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక డాగ్ స్క్వాడ్ సైతం శుక్రవారం అవే స్పాట్స్ ను గుర్తించాయి. దీంతో రెండు చోట్లా తవ్వకాలు సంక్లిష్టంగా మారాయి. భారీగా నీరు ఊరుతుండడంతో మూడు పంప్ లతో నీటిని బయటకు పంపుతున్నారు. ఎండ్ పాయింట్ సమీపంలో TBM మిషన్ ముందు భాగం శకలాలతో పూర్తిగా బురదలో కూరుకుపోయింది. మిషన్ కింద కంపార్ట్ మెంట్ లో కార్మికుల ఆచూకీ ఉండొచ్చని రెస్క్యూ బృందాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టన్నెల్ లో విరిగిపోయిన TBM మిషన్ శకలాలను వేగంగా బయటికి తీస్తున్నారు. అయితే ప్రస్తుతం టన్నెల్‌లో త్వకాలు జరుపుతున్న ప్రాంతంలో భరించలేనంతగా దుర్వాసన వస్తున్నట్లు సమచారం. బహుషా అక్కడే కార్మికుల ఆచూకీ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.