వరంగల్ బ్యూరో, మార్చి 7 (ప్రజా జ్యోతి):
హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు 50 యేండ్లకు ఒక్కట్టయ్యారు. శుక్రవారం రోజున దామెర జిల్లా పరిషత్ పాఠశాలలో 1974 – 75 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించి అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గత స్మృతులను ప్రస్తుత విద్యార్థులతో నెమరు వేసుకున్నారు. 50 ఏళ్ల క్రితం విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయుడు ‘కొరివి’ గారిని పిలిచి ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి మాడుగుల ధనుంజయ శర్మ పాఠశాలకు సరస్వతి విగ్రహాన్ని బహుకరించి, ఏర్పాటు చేయించారు. అట్టి విగ్రహాన్ని ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకోవడానికి ధనుంజయ శర్మ ఎంతగానో శ్రమించారని పలువురు ఆయనను అభినందించారు.