వరంగల్ సిటీ, మార్చి 6 (ప్రజాజ్యోతి):
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము నందు విశ్వవిద్యాలయ శాఖ ‘జానపద ట్రైబల్లూర్ స్కూల్ ఆఫ్ ఫోక్ అండ్ ట్రైబల్లూర్’ విభాగములో వరంగల్ జిల్లాకు చెందిన సోనబోయిన సతీష్ కి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయము పరీక్షల నియంత్రణాధికారి. ప్రొ. కె.హనుమంత రావు అవార్డును ప్రకటించారు. విశ్వవిద్యాలయము ఆచార్య బట్టు రమేష్ పర్యవేక్షణలో ముదిరాజుల వృత్తి-జీవన విధానం అంశంపై అధ్యాయం చేసి తన సిద్ధాంత గ్రంథమును సమర్పించారు. ఈ సందర్భంగా సోనబోయిన సతీష్ మాట్లాడుతూ తాను ఎం ఏ తెలుగు, సంస్కృతం, టీపీటీ, బి ఎల్ ఐ ఎస్ సి పూర్తి చేశానన్నారు. ప్రస్తుతం వరంగల్ నగరంలోని విశ్వేశ్వర సంస్కృతాంత డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేయుచున్నారు. సతీష్ తన పరిశోధనా కాలంలో 39 కి పైగా పరిశోధనా పత్రాలను వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ నందు ప్రచురించినారు. తన పరిశోధన కొనసాగించడంలో పట్టా పొందడంలో సహకరించిన ఆచార్య భట్టు రమేష్ కి, జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి ప్రొఫెసర్ భూక్య బాబురావు కి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం వెంకన్నకి కృతజ్ఞతలు తెలిపారు. సంస్కృతాంధ్ర కళాశాల అధ్యక్షులు ఆకారపు హరీష్ కుమార్, కార్యదర్శి ఆచార్య చిలకమారి సంజీవ, కోశాధికారి చకిలం ఉపేందర్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ,విద్యార్థి విద్యార్థులు సతీష్ ను అభినందించారు.