హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి టీజీఎస్ఆర్టీసీ అదిరిపోయే రాయితీ

V. Sai Krishna Reddy
0 Min Read

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ మార్గంలో ప్రయాణించే వారికి రాయితీలను ప్రకటించింది. ఆయా బస్సుల్లో 8 శాతం నుండి 10 శాతం వరకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసులలో 10 శాతం రాయితీని ప్రకటించింది. రాజధాని ఏసీ సర్వీసుల్లో 8 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించేవారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ యాజమాన్యం కోరింది. టీజీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *