మంత్రి జూపల్లిని కలిసిన నిరుద్యోగులు
ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:
జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నికల్ పరీక్ష రాసిన నిరుద్యోగులు కలిశారు. 2024 నవంబర్ ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షలు రాశామని ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి జూపల్లి హెల్త్ సెక్రటరీ కి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకొని ఫలితాలు త్వరగా విడుదల చేయాలని సూచించారు.