భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య
బెంగాల్ లోని హౌరా జిల్లాలో ఘటన
ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉంది. అయినా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతడితో కలిసి పారిపోవాలనుకుంది. అలా వెళ్లిపోతే ఒకెత్తు. కాని మరీ అన్యాయంగా భర్త కిడ్నీని భర్తతోనే విక్రయింపచేసింది. కూతురి జీవితానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని నమ్మబలికింది. ఆమెను నమ్మిన భర్త కిడ్నీ అమ్మేసి రూ.10 లక్షలు భార్య చేతికిచ్చాడు. ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైందా ఇల్లాలు. బెంగాల్లోని హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది