మహిళల క్రికెట్ మరింత ముందుకెళ్తోంది.. ఒకప్పుడు సీనియర్ల స్థాయికే పరిమితమైన క్రికెట్ ఇప్పుడు అండర్-19 స్థాయికీ వచ్చింది. ఇందులోనూ ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ఏడాదిలో కొంగొత్తగా ప్రపంచ కప్ జరగనుంది.
మలేసియాలో.. క్రికెట్ లో పెద్దగా పేరు లేని దేశం మలేసియా. దీనికీ క్రికెట్ జట్టున్నా అదింకా ప్రపంచ స్థాయికి ఎదగలేదు. కాగా, 2025లో మలేసియాలోనే అండర్-19 ప్రపంచ కప్ జరగనుంది. ఆ దేశ రాజధాని కౌలాలంపూర్ లో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు కప్ జరగనుంది. మొత్తం 41 మ్యాచ్ లున్నాయి. 16 జట్లను 4 గ్రూప్ లుగా విభజించారు. గ్రూప్ లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ కు, అక్కడ రెండు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్ కు వెళ్తాయి