మెదక్ జిల్లా రామాయంపేట(Ramayampet) మండలం రాయిలాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్(Online Betting)లో భారీగా నష్టపోయి ప్రశాంత్(24) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య(Young Man Suicide) చేసుకున్నాడు. బెట్టింగ్‌లో దాదాపు రూ.10 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రశాంత్ హైదరాబాద్‌లో తాను పనిచేసే పెట్రోల్ బంక్‌లో ప్రాంతంలో ఉరివేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.