ముగిసిన మేడారం మహా జాతర

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రపంచ ప్రఖ్యాత మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ మహా జాతరకు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వన దేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సమ్మక్క తల్లిని భక్తుల జయజయధ్వానాల మధ్య పూజారులు నిన్న సాయంత్రం వన ప్రవేశం చేయించారు. మిగతా గద్దెలపై కొలువై పూజలందుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైతం ఆయా పూజారులు తమ ప్రాంతంలోని గుళ్లకు తీసుకువెళ్లారు. దీంతో మహాజాతర ముగిసింది.

జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ ఎక్కడా అపశ్రుతులు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మేడారంలోని జంపన్న వాగుతో పాటు గద్దెల ప్రాంగణం, మ్యూజియం ఇలా వివిధ ప్రాంతాల్లో భక్తజన సందోహం నెలకొంది. ట్రాఫిక్ అంతరాయం, స్వల్ప ఘటనలు మినహా మేడారం మహాజాతర ప్రశాంతంగా ముగిసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *