మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ చీరలు 

Warangal Bureau
1 Min Read
  • మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ చీరలు
  • బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు వ్యాఖ్యలు

ఖానాపూర్, నవంబర్ 24 (ప్రజా జ్యోతి) 

ఖానాపూర్ మండలం మంగళ వారి పేట గ్రామపంచాయతీ ఆవరణలో సోమవారం ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను అధికారులు, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల జగన్ మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మహిళా సోదరీమణుల ఆత్మ గౌరవం ప్రతిబింబించేలా ఇందిరమ్మ చీరలను రూపొందించారన్నారు. ప్రజా పాలనలో నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్, డి లపిఎం రేవతి, ఏపీఎం రమాదేవి, జిపిఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి యుగంధర్ తదితరులున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *