ఎల్లారెడ్డి ఆగష్టు-13(ప్రజా జ్యోతి):
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రసిద్ధ గోపాలస్వామి (శ్రీకృష్ణ) ఆలయంలో ఈ శనివారం ఆధ్యాత్మిక వేడుకలు అట్టహాసంగా జరపనున్నట్లు విశ్వహిందూ పరిషత్ ఎల్లారెడ్డి ప్రఖండ అధ్యక్షులు సాతెల్లి నవీన్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయంలో ఉదయం 7 గంటలకు యజ్ఞం, 10 గంటలకు గోపూజ, 11 గంటలకు ప్రముఖ వక్తల సందేశం, అనంతరం గోపాల కలువ (ఉట్టి కొట్టడం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1 గంలకి అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఎల్లారెడ్డి పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాతెల్లి నవీన్ కుమార్ కోరారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తులకు శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందే అద్భుత అవకాశంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
