ప్రవేట్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్స్ అమ్మకాలు..?

Rammoorthy Kamareddy
1 Min Read

ప్రవేట్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్స్ అమ్మకాలు..?

ప్రజా జ్యోతి, ఆర్.సి బాన్సువాడ (జూన్ 05)

ప్రైవేట్ పాఠశాలలో యూనిఫారమ్స్, బూట్లు అమ్మకాలు చేపట్టకూడదని పిడిఎస్యు (ఎస్) టి.ఎస్.పి,- జివిఎస్ (ఎస్) విద్యార్థి సంఘాలు గురువారం డిమాండ్ చేశారు.ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు (ఎస్) తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ డీఎస్పీ, గిరిజన విద్యార్థి సంఘం జి వి ఎస్, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బాన్స్వాడ మండల విద్యాధికారి ఎంఈఓ కు వినతి పత్రం అందజేయడం అంతా చేయడం జరిగిందని అన్నారు.ఈ సందర్బంగా పిడిఎస్యు (ఎస్)జిల్లా అధ్యక్షులు ఎన్. బాల్ రాజ్, టి ఎస్ పి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్,జివిఎస్ జిల్లా అధ్యక్షులు సభవత్ వినోద్ లు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం జూన్ మాసంలో విద్య సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్లు, యూనిఫారమ్స్ మరియు బూట్లు సాక్స్ లు అధిక ధరలకు, అధిక లాభాల కోసం, ప్రైవేట్ పాఠశాలల యాజ్యమాన్యాలు అమ్ముకుంటున్నారన్నారు. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లి తండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారని , పిల్లల చదువులకోసం అప్పులు తెచ్చి పాఠశాలలో చేర్పిస్తే స్కూల్ ఫీజులే భారం అనుకునే తల్లి తండ్రులకు ఈ పాఠ్యపుస్తకాలు యూనిఫారమ్స్ అమ్మకాలతో మరో భారం వారీపై పడుతుందన్నారు. కావున ప్రైవేట్ విద్య సంస్థల్లో కూడా పాఠ్య పుస్తకాలు,యూనిఫారమ్స్, బూట్లు సాక్స్ లు విక్రంచకుండా విద్యాధికారులు ప్రతి విద్య సంస్థలో నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్య సంస్థల పై విద్యార్థుల ఆధ్వర్యంలో తగిన కార్యాచరణ చేపడుతమని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *