బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఖరారు

V. Sai Krishna Reddy
1 Min Read

హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఖరారయ్యాయి. ఉబ్బసం, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుందని నమ్మకంతో, ఈ ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

ఈ ఏడాది జూన్ నెల 8, 9 తేదీల్లో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఆ రెండు రోజులూ అక్కడే ప్రసాద వితరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను బత్తిని కుటుంబ సభ్యులు పర్యవేక్షించనున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *