విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి
రామారెడ్డి మే 21 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రామారెడ్డి మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన భుఖ్య రాజు (35) ఉదయం తన పంట పొలంలో ఉన్న చెట్లను తొలగిస్తున్న సందర్భంలో విద్యుత్ బోరుకు సరఫరా అవుతున్న విద్యుత్ తీగలను గమనించక గోడ్డలి కి తీగలు తగలడంతో మృతుడి కి చేతులకు కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడం వలన పరిసర ప్రాంతాల రైతులు గమనించి చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా కామారెడ్డి ఏరియా వైద్య సిబ్బంది. చనిపోయాడని నిర్ధారించడంతో ప్రమాద మృతుడి భార్య వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.