దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎంతో ఉత్కంఘగా ఎదురు చూస్తున్న సీబీఎస్సీ12వ తరగతి ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయి. ఈ రోజు (మే 13) ఉదయం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in, https://cbseresults.nic.in/లలో తమ వివరాలు నమోదుచేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్‌లను ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు డిజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.