సమ్మర్‌ సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రస్తుతం తెలంగాణలో విద్యాసంస్థలకు సమ్మర్‌ హాలిడేస్‌ కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 12 వరకు విద్యార్థులకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలకు కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవులును ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు వేసవి సెలవులను ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ సెలవుల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు టేక్‌ హోమ్‌ రేషన్‌ ద్వారా గుడ్లు, సరుకులు సరఫరా చేయనుంది. సెలవుల్లో అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటి సర్వే వంటి విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వేసవి కాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు వేసవి సెలవులు ఇవ్వాలని అంగన్‌వాడీ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు, సీఐటీయు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్‌ ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయితే అంగన్‌వాడీ యూనియన్ల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులును ప్రకటించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *