పర్వతగిరి, ఏప్రిల్ 11 (ప్రజాజ్యోతి)
పర్వతగిరి మండల కేంద్రములోని లయోల (ఇంగ్లీష్ మీడియం) హైస్కూల్ లో పర్వతగిరి గ్రామానికి చెందిన రూపాని సాయికుమార్ వర్షిని ల కూతురు లిప్సిక(5) ఎల్ కేజి చదువుతుంది. రోజులాగానే శుక్రవారం ఉదయం స్కూలుకు వెళ్లిన లిప్సిక ను చిన్నపిల్ల అని చూడకుండా టిచర్ రమ కట్టేతో గట్టిగనే కోట్టడంతో ఒళ్లంతా వాతలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు, మేనమామ అయిన ఉపేందర్ కు తెలుపగా స్కూలుకు వెళ్లి యాజమాన్యాన్ని అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, చిన్న పిల్లను కొట్టడం ఏంటని ప్రశ్నిస్తే కొట్టిన టీచర్ వెళ్ళిపోయింది రేపు వచ్చాక రండి ఎం జరిగిందో మీకే అర్థమవుతుంది అనడంతో వాపోయిన మేనమామ గతంలో ఒకటి రెండు సార్లు ఇలా జరిగినా కానీ యాజమాన్యానికి చెప్పిన ఏలాంటి స్పందిన లేదని అన్నారు. ప్రైవేటు యజమాన్యంపై అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
లయోలా స్కూల్ యాజమాన్యం వివరణ కోరగా..
చిన్నపిల్లని కొట్టడం చాలా తప్పు గతంలో మేము టీచర్లకు అందరికీ చిన్న పిల్లల్ని కొట్టొద్దని టీచర్ పేరెంట్స్ మీటింగ్ లో కూడా చెప్పాము. ఆయన గాని కొడుతున్నారు. రేపు రండి మాట్లాడుకుందాం అని చెప్పి విద్యార్థిని మేనమామకు చెప్పడం జరిగింది. మళ్లీ ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటాం అన్నారు.