మొదటి లడ్డూ శ్రీకాంత్ ముదిరాజ్ చైతన్యకు.. రెండోది డి.శ్రీధర్ ముదిరాజ్‌కు
చేవెళ్ల, సెప్టెంబరు 25(ప్రజా జ్యోతి):
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు మల్కాపూర్‌లో వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా వినాయక లడ్డూ ప్రసాదాల వేలంపాట నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలంలో మొదటి లడ్డూను శ్రీకాంత్ ముదిరాజ్ చైతన్య, పల్లవి స్కూల్ డైరెక్టర్ కలిసి రూ.66,000కు దక్కించుకున్నారు. రెండో లడ్డూను డి. శ్రీధర్ ముదిరాజ్ రూ.42,000కు సొంతం చేసుకున్నారు. మూడో లడ్డూను డి. మహేశ్వరి రూ.26,000కు, నాలుగో లడ్డూను సీహెచ్. ప్రవీణ్ ముదిరాజ్, సీహెచ్. వినయ్ ముదిరాజ్ కలిసి రూ.25,000కు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా పైసల దండ వేలంపాటలో సీహెచ్. శ్రీకాంత్ ముదిరాజ్ రూ.60,000కు దక్కించుకున్నారు. లడ్డూ ప్రసాదాలు, పైసల దండ కోసం భక్తులు ఉత్సాహంగా వేలంపాటలో పాల్గొనడంతో మల్కాపూర్‌లో సందడి నెలకొంది. అధిక మొత్తాలకు ప్రసాదాలను దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. వేలంలో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
