అదనపు కట్నం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

Warangal Bureau
1 Min Read

అదనపు కట్నం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

ఆత్మకూరు, సెప్టెంబర్ 01 (ప్రజాజ్యోతి):

అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఓ వివాహిత ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆత్మకూరు మండలం గూడెప్పాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామానికి చెందిన అఖిల (24)ను ఆత్మకూరు మండలం గూడెప్పాడు గ్రామానికి చెందిన చల్లా ప్రవీణ్‌రెడ్డికి ఇచ్చి 2022 న వివాహం చేశారు. వీరికి అధిక్‌రెడ్డి అనే కుమారుడు సంతానం కలిగాడు . వివాహం జరిగిన సుమారు రెండేళ్ల తర్వాత నుంచి భర్త ప్రవీణ్‌రెడ్డి అదనపు కట్నం కింద రూ.50 వేల కోసం అఖిలను వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్టు 31న కూడా ప్రవీణ్‌రెడ్డి అఖిలతో గొడవపడి అదనపు కట్నం కోసం డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ వేధింపుల కారణంగానే మనస్తాపానికి గురైన అఖిల సెప్టెంబర్ 1 న ఉదయం గూడెప్పాడు లోని తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు బుర్ర చందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *