వర్షాల ప్రభావం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
— ఎస్సై మురళి
రామారెడ్డి జూలై 29 (ప్రజా జ్యోతి)
వర్షాలు భారీగా కురుస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల మూడు రోజులలో అతి బారి వర్షాలు కురుస్తున్నందున పాత శిధిలావస్థలో ఉన్న ఇళ్ల నుండి దూరంగా ఉండాలని భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి. విద్యుత్ తీగలు స్తంభాలు లేదా ట్రాన్స్ఫర్ ల సమీపంలోకి వెళ్ళవద్దు పొంగి పొర్లుతున్న వాగులు చెరువులు కుంటలు దాటడానికి ప్రయత్నించవద్దు, అవసరమైతే తప్ప బయటకు రావద్దు ప్రమాదకరమైన మార్గాలను నివారించాలి. చిన్నపిల్లలు వృద్ధుల ఆరోగ్య విషయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఆరోగ్యం పట్ల పూర్తిగా అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అని మండల ప్రజలకు పలు సూచనలు చేయడం జరిగింది.
