కిక్ బాక్సింగ్ జిల్లా కమిటీ ఎన్నిక

Bharath Gowd
0 Min Read

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మెదక్ జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని గురువారం రామాయంపేటలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు పూర్ణచందర్ అధ్యక్షతన జరిగిన ఈ కిక్ బాక్సింగ్ సమావేశానికి డివైఎస్ఓ రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో నర్సాపూర్ మండలానికి చెందిన నాగరాజు (జిల్లా ప్రధాన కార్యదర్శి), గోపాల్ (ఉపాధ్యక్షుడు), శేఖర్ (సంయుక్త కార్యదర్శి) గా ఎంపికయ్యారు. జిల్లాలో కిక్ బాక్సింగ్ క్రీడను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన సభ్యులు వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *