సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14 (ప్రజాజ్యోతి):మహోన్నతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,మాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కందూరి కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ మాల, మాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రైతు బజార్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి రాజ్యాంగాన్ని. అందించారన్నారు.ఎలాంటి బేధాలు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, రక్షణ కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేశారని అన్నారు.రాజ్యాంగ రచన ద్వారా అణగారిన వర్గాలకు, స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించి, దేశ సమగ్రతకు బలమైన పునాదులు వేశారని అన్నారు.ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ షఫీఉల్లా, ఎంఈడబ్ల్యూఎస్ రాష్ట్ర సెక్రెటరీ సామ రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు గోవర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ఏసిపి బైరం గంగాధర్, ఓయూ ప్రొఫెసర్ కందుల గోవింద్,సిఐ క్రాంతి, ఎంఈడబ్ల్యూఎస్ జిల్లా అధ్యక్షులు బొల్లెద్దు యాదయ్య, టిఈఏఎం జిల్లా అధ్యక్షులు నామ నాగయ్య, గౌరవ అధ్యక్షులు బొల్లెద్దు దశరథ, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బొల్లెద్దు వెంకటేశ్వర రావు,రాష్ట్ర బాధ్యులు చింతపల్లి వెంకటేశ్వర్లు, ఎడ్ల ముక్కంటి, అన్నపర్తి జాన్ సుందర్,కన్నె శివయ్య, అనుములపురి గిరిబాబు, యాదయ్య, రాధాకృష్ణ, కోటేశ్వరరావు, వెంకటరత్నం, మల్లేష్, ఆనంద్ భాస్కర్,సత్యనారాయణ, దాసరి ఆరోగ్యమ్మ, రేణుక,బుచ్చి రాములు, కొచ్చర్ల వేణు తదితరులు పాల్గొన్నారు.
