సమాచార హక్కు చట్టం వీరికి వర్తించదా..?

Kamareddy
1 Min Read

సమాచార హక్కు చట్టం వీరికి వర్తించదా..?

— గ్రామపంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యమా..?

— ఆ కార్యాలయంలో సమాచార బోర్డు లేదు

–వీరికి నిబంధనలు వర్తించవా..?

రామారెడ్డి ఏప్రిల్ 01 (ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని ఇస్సన్నపల్లి గ్రామపంచాయతీలో గత రెండు సంవత్సరాల నుండి సమాచార హక్కు చట్టం కు సంబంధించిన సూచిక బోర్డు కానీ, పెయింటింగ్ తో వేసిన చార్ట్ కానీ పెట్టకపోవడం పై గల కారణమేమిటి..?ఈ కార్యాలయానికి సమాచారాకు హక్కు చట్టం అంటే అంతా నిర్లక్ష్యమా? ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ప్రతి సామాన్యుడికి న్యాయం అందే విధంగా ప్రతి ఒక్కరికి సమాచారం తెలుసుకొనే హక్కు సమాచార హక్కు- 2025 చట్టాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఈ యొక్క చట్టం పై సెక్రెటరీ నిర్లక్ష్యధోరణి గా వహిస్తున్నారని సమాచారం..?

సమాచారకు చట్టం అనేది..!

సమాచార హక్కు చట్టం- 2005 అనేది భారత పౌరులకు ప్రభుత్వం నుండి సమాచారాన్ని పొందే అధికారాన్ని కల్పించే ఒక శక్తివంతమైన చట్టం. దీని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచవచ్చు.ఈ చట్టానికి సంబంధించిన ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది.అవినీతిని అరికట్టడం మరియు ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకతను తీసుకురావడం. కోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన అంశం ఉంది. ఈ విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాల్సిందే

ఎంపీడీవో వివరణ కోరగా..!

సంబంధిత మండల ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా ను వివరణ కోరగా ఇసనపల్లి కార్యదర్శి సత్యవతి కి సమాచారకు– 2005 చట్టం కు సంబంధించిన బోర్డు, లేదా పెయింటింగ్ వేయించాలని  సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *