నర్సాపూర్ (ప్రజాజ్యోతి) స్థానిక రాయరావు చెరువులో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. (సుమారు 40-45 ఎళ్ళు) 5’2” ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహంపై ఎరుపు రంగు చెక్స్ షర్టు, నలుపు రంగు ప్యాంటు ఉన్నాయి. మృతుడి తల వెంట్రుకలు గుండు చేసి ఉన్నాయి. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు నర్సాపూర్ ఎస్సై రంజిత్ కుమార్ (8712657941), సీఐ జాన్ రెడ్డి (8712657940) ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
